కారులో ఉండే ఈ బటన్‌ను చాలామంది సరిగా ఉపయోగించరు.. ఎప్పుడు వాడాలో చూద్దాం..!
- డ్యాష్‌బోర్డ్‌లో ఎయిర్ రీసర్క్యులేషన్ బటన్
- సరిగా వాడితే కారు వేగంగా చల్లబడుతుంది
- మైలేజ్ పెరుగుతుంది
- వేసవిలో ఆన్ చేయాలి
- చలికాలంలో ఆఫ్ చేయాలి
కార్ల డ్యాష్‌బోర్డ్‌పై కారు గుర్తు లోపల వంపు తిరిగిన బాణం ఆకారంలో ఒక బటన్ ఉంటుంది. దీన్ని ‘ఎయిర్ రీసర్క్యులేషన్’ బటన్ అంటారు. చాలామందికి దీని గురించి తెలియక పట్టించుకోరు. కొందరేమో ఎప్పుడూ దీన్ని ఆన్‌లోనే ఉంచుతారు. కానీ దీన్ని సరైన పద్ధతిలో వాడితే... ఏసీ ఆన్ చేసినప్పడు కారు వేగంగా చల్లబడుతుంది. మైలేజ్ పెరుగుతుంది. బయటి కాలుష్యం లోపలికి రాకుండా ఉంటుంది. దీన్ని ఎప్పుడు ఆన్ చేయాలి? ఎప్పుడు ఆఫ్ చేయాలో చూద్దాం..!
వేసవికాలంలో ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు ఈ బటన్‌ను కచ్చితంగా ఆన్ చేసుకోవాలి. ఇది నొక్కినప్పుడు బయటి వేడి గాలి లోపలికి రాకుండా కారు లోపల ఉండే ఫ్లాప్స్ మూసుకుపోతాయి. ఏసీ సిస్టమ్ లోపల అప్పటికే చల్లబడిన గాలినే మళ్లీ మళ్లీ సర్క్యులేట్ చేస్తూ క్యాబిన్‌ను త్వరగా కూల్ చేస్తుంది. దీనివల్ల ఏసీ కంప్రెసర్‌పై భారం తగ్గి ఇంధనం ఆదా అవుతుంది. అలాగే ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ముందు వాహనాల నుంచి వచ్చే డీజిల్ పొగ, దుమ్ము, రోడ్డుపై వచ్చే దుర్వాసనలు కారు లోపలికి రాకుండా ఈ బటన్ అడ్డుకుంటుంది.
ఆ టైమ్ లో మాత్రం అస్సలు ఆన్ చేయొద్దు!
అయితే చలికాలంలో లేదా వర్షం పడేటప్పుడు ఈ బటన్‌ను అస్సలు ఆన్ చేయొద్దు. ఈ సమయంలో కారు లోపల ఉన్నవారి శ్వాస వల్ల, తడి దుస్తుల వల్ల క్యాబిన్ లోపల తేమ పెరిగిపోతుంది. ఈ బటన్ ఆన్‌లో ఉంటే ఆ తేమ బయటకు పోలేక విండ్‌షీల్డ్, కిటికీ అద్దాలపై పొగమంచులా పేరుకుపోయి దారి కనిపించకుండా పోతుంది. అద్దాలు ఇలా మసకబారినప్పుడు వెంటనే ఈ బటన్‌ను ఆఫ్ చేసి ‘ఫ్రెష్ ఎయిర్ మోడ్’ ఆన్ చేయాలి.
అలాగే, కారులో ఎక్కువ మంది ప్రయాణిస్తున్నప్పుడు ఆక్సిజన్ తగ్గి నిద్రమత్తు రాకుండా ఉండటానికి అప్పుడప్పుడు దీనిని ఆఫ్ చేసి బయటి గాలిని లోపలికి రానివ్వాలి.